హోలీ ఫ్యామిలీ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
జనవరి 10, నల్లా సమాచార్ న్యూస్ / మణుగూరు :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పి.వి కాలనీ టౌన్షిప్ నందుగల హోలీ ఫ్యామిలీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా ముగ్గుల పోటీలు,పతంగి ఎగరవేయడం, ఆటలు పాటలతో సంబరాలు చేసుకున్నారు.మరియు మోడ్రన్ డ్రెస్ ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లూర్డు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు,కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగల కార్యక్రమాలు సాంప్రదాయ బద్ధంగా పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, సంక్రాంతి పండుగ సంబరాలు కూడా నిర్వహించడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పగిడిపల్లి సతీష్,అనిత టీచర్,సిస్టర్ జెస్సి,సిస్టర్ ప్రభ, వ్యాయామ ఉపాధ్యాయుడు సోలం శ్రీనివాస్, నరేందర్ శ్రీను, రఘు, స్వాతి, ఆస్మా, హిమబిందు, స్రవంతి, రేవతి, డ్రైవర్ రమేష్,క్లీనర్ నాగయ్య, స్లీపర్లు భద్రమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు.