ప్రభుత్వాదాయనికి గండిపడుతున్నా… పట్టించుకోని కమిషనర్..?
ఒకటవ డివిజన్ క్రాంతి కాలనీ లో జనావాసాల మధ్య భారీ షెడ్డు
తక్షణమే షెడ్డుపై చర్యలు తీసుకోవాలని కుర్రి శివకుమార్ డిమాండ్
ప్రజా ప్రతినిధి బంధువుల అండతో ఒకటో డివిజన్లో నిర్మిస్తున్న అక్రమ షెడ్ల నిర్మాణాలు?
ప్రజా ప్రతినిధి ఒత్తిడికి తలోగ్గి చర్యలు తీసుకోవడానికి జంకుతున్న కమిషనర్,టౌన్ ప్లానింగ్ అధికారులు?
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకటో డివిజన్ లో మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టి అక్రమ షెడ్ల నిర్మాణాలు భారీ ఎత్తున చేపడుతున్నారని వెంటనే షెడ్లపై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కుర్రి శివకుమార్ డిమాండ్ చేశారు. ఒకటో డివిజన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రతినిధి, ప్రజా ప్రతినిధి బంధువులు భారీ ఎత్తున ముడుపులు అందుకొని అక్రమ షెడ్లను ప్రోత్సహిస్తున్నారని స్థానిక ప్రజల ఆవేదన చెందుతున్నారు.