నల్లా సమాచార్ న్యూస్, హైదరాబాద్ 9849396606
కులగణ సర్వేలో కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే చర్యలు
కులగణన సర్వేలో కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకే ఈ ప్రక్రియని నిర్వహిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు
కులగణలో సర్వేలో కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకే ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు
శుక్రవారం ఆయన స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఖరారుపై కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల ,రాజన్న సిరిసిల్ల జిల్లాల బహిరంగ విచారణకు విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు .అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంటి యజమాని సమగ్ర వివరాలు అందించాలని ఎవరైనా విదేశాల్లో ఉంటే వారి ఆధార్ కార్డును గణకులకు చూపించి సమాచారాన్ని పొందుపరచాలన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందిస్తే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.