ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
అక్టోబర్ 20, నల్లా సమాచార్ న్యూస్ / గజ్వేల్ :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-1998 సంవత్సర 10 వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున గజ్వేల్ పట్టణంలోని పిఎన్ఆర్ బ్యాంకేట్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారంతా తమ జ్ఞాపకాలను, గత స్నేహ బంధాలను, ఆనాటి మధురస్మతులను గుర్తుచేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకుంటూ వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నామని చివరకు ఇలాంటి రోజు వచ్చిందని తెలుపుతూ మిత్రులను మళ్ళీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం కష్టపడి, విజయవంతం చేసిన తమ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.