గాంధీ మెమోరియల్ హైస్కూల్ పెబ్బేర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పాఠశాల లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబు చేసి కన్నుల పండుగగా సంబరంగా అడుకున్నారు.
విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, డాన్స్ లు నిర్వహించి, గెలుపొందిన వారికి క్లాస్ టీచర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ జిజు పీకే గారు మాట్లాడుతూ ప్రకృతిని దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రానిదని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి, విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగని,తెలంగాణ ఆడపడుచులు, అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేదే బతుకమ్మని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.