నల్లా సమాచార్ న్యూస్ – 26-09-2024
మీ క్షేమమే మా లక్ష్యం..
నగర నలువీధుల శుభ్రతకు మూల కారణం మీరు…
మీ ఆరోగ్యమే మా అభిలాష..
GWMC కార్మికులతో ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్…
కార్మికులకు మెడికల్ కిట్ పంపిణి మరియు హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం /వరంగల్.
తేదీ :26/09/2024-గురువారం.
వరంగల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో “స్వచ్ఛతాహి ఈ సేవ 2024″లో భాగంగా బల్దీయ ఆధ్వర్యంలో ప్రతిమ కాన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఏర్పటి చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, GWMC కమిషనర్ అశ్విని తనాజీ వాకాడే గారు..*
నిత్యం మహానగర పరిశుభ్రం కోసం అహర్నిశలు శ్రమించే కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక ద్రుష్టి ఉటుందని ఎమ్మెల్యే గారు అన్నారు.
కార్మికులకు మెడికల్ కిట్ లను మరియు మెడికల్ కార్డు లను పంపిణి చేశారు.కార్మికులతో పాటు ఎమ్మెల్యే గారు పరీక్షలు చేయించుకున్నారు.
కార్మికులందరికి వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం పరిచిన ఎమ్మెల్యే నాయిని.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్యులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.