నల్లా సమాచార్ న్యూస్ 9849396606
భాగ్ లింగం పల్లి
10 ఎకరాల లోపు సాగు రైతులకు రైతు భరోసా తక్షణమే వర్తింప చేయాలి
భూ సమస్యల పరిష్కారానికి డిజిటల్ సర్వే చేపట్టాలి
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని అక్టోబర్ 15న మండల కేంద్రాల్లో ఆందోళనలు
ఏఐకెఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశ నిర్ణయం
రైతుల పెట్టుబడి సహాయం కోసం తక్షణమే 10 ఎకరాల లోపు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అమలు చేసి ఎకౌంట్లో డబ్బులు జమ చేయాలని, రైతులు పండించే అన్ని రకాల వరి ధాన్యాలకు క్వింటాకు 500 రూపాయల బోనస్ వర్తింపచేయాలని, రైతుల రెండు లక్షల రుణాలను బేషరతుగా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
ఈరోజు అఖిలభారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వసుకుల మట్టయ్య అధ్యక్షతన స్థానిక ఓంకార్ భవన్ లోని బిఎన్ హాల్లో జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల సాగు అవుతున్న అధిక వర్షాలు ప్రభుత్వ విధానాలతో రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి మరోవైపు అధిక వర్షాలతో పంటలు కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాన పంటలైన పత్తి మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయని కేవలం వారి పంట మాత్రమే కొంత ఆశాజనకంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు ప్రభుత్వం రైతులకు అనేక ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో మొండి చేయి చూయిస్తున్నదని వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరాకు పదివేలు ఇస్తామని చెప్పి నేటికీ క్షేత్రస్థాయిలో పంటల సర్వే చేపట్టకుండా ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని అంటూనే ఆచరణలో కుంటి సాకులతో అమలు చేయడం లేదని 72 లక్షల మంది రైతులలో బ్యాంకర్స్ ఇప్పటివరకు కేవలం 12 లక్షల మందికి మాత్రమే పంట రుణాలు ఇచ్చారని అలాగే రైతులు అనేక దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటూ వారసత్వంగా వస్తున్న భూములను సైతం రికార్డులోంచి తొలగించి అనేక ఇబ్బందులకు గత ప్రభుత్వం గురిచేసిందని సరిచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ సరి చేయకపోవడం విడ్డురంగా ఉందన్నారు. అలాగే రైతులు పండించిన వరి ధాన్యానికి ఎకరాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సన్న రకం వరి ధాన్యానికే ఇస్తామని అనడం సరైంది కాదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని ఎన్నికల హామీలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగ పోరాటాలను ఉదృతం చేయాలని నిర్ణయించినట్లు ఈ క్రమంలో అక్టోబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గుండెబోయిన చంద్రయ్య మహమ్మద్ ఇస్మాయిల్ వక్కల కిషన్ సింగతి మల్లికార్జున్ నాగేల్లి కొమరయ్య కర్ర రవీందర్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి మారయ్య అంజయ్య పెంటయ్య ఓడ్డే నర్సింలు తదితరులు పాల్గొన్నారు.