Nalla Samachar News Hyderabad 9849396606:
తెల్కల మల్లారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరైన ఎంపీఆర్
ఉప్పల్ మాజీ సర్పంచ్ తెల్కల బాల్ రెడ్డి గారి కుమారుడు తెల్కల మల్లారెడ్డి గారి వర్ధంతి వేడుకలకు ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఉప్పల్ లో సోమవారం మల్లారెడ్డి వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో మల్లారెడ్డి సోదరుడు తెల్కల మోహన్ రెడ్డి గారు ,వారి కుమారుడు సుజీత్ రెడ్డి ,పూజల ప్రభాకర్ గుమిడెలి రాజేష్ ,మందమురళీకృష్ణ రెడ్డి , అన్నపురెడ్డి కృష్ణ రెడ్డి ,బంటీ తదితరులు పాల్గొన్నారు.