అవసరం ఉంటే తప్ప అడుగు ఇంటి బయట వేయకండి..
Nalla Samachar News Hyderabad serilngampally Constituency:
శేరిలింగంపల్లి ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండాలని,జి.హెచ్.ఎం.సి అధికారులు,పోలీస్ డిపార్ట్మెంట్ సిబంది తగు జాగ్రత్తలు తీసుకుంటుందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు..*
💥భారీ వర్షాలు,ఈ జాగ్రత్తలు పాటించండి..
➡️ *వర్షంలో తడిచిన విద్యుత్ స్తంభాలు,తడి చేతులతో స్టార్టర్లు,మోటార్లు,స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు..*
➡️ *విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు..*
➡️ *చిన్న పిల్లలు కరెంట్ వస్తువులకు దూరంగా ఉంచాలి..*
➡️ *ఇంట్లో ఇనుప తీగలపై దుస్తులు ఆరబెట్టుకోవద్దు..*
➡️ *ఉరుములు,మెరుపుల సమయంలో డిష్ వైర్,టీవీ నుంచి తీసివేయాలి..*
➡️ *రోడ్లపై నీరు నిలిచినప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్లాలి..*
➡️ *వరద భారీగా చేరే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు..*