అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన కోడూరు
ఆగస్ట్ 13, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట మండలం :
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో చల్ల రవి వాళ్ళ తల్లి చల్ల యాదమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందగా డ్రైవర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి సామాజిక కార్యకర్త కోడూరు శివకుమార్ గౌడ్ అంత్యక్రియలకు గాను 5000/- ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించాడు. గ్రామం లోని పేద ప్రజల కు అండగా ఉంటూ అనేక సేవలు చేస్తున్న కోడూరు శివకుమార్ ని పలువురు గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో చెవుల నరసయ్య ఈసం బిక్షపతి చల్లా కిషన్ అంబాల రాజేష్ వంగపెల్లి అశోక్ చల్ల శ్రీను గునుగంటి నరసింహులు కొరివి రాజు తదితరులు పాల్గొన్నారు.