శ్రీ యుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి “తెలంగాణ రెడ్డి సంఘం” సమర్పించు విజ్ఞాపణ పత్రము
విషయం:- రెడ్డి కార్పొరేషన్ కు చట్టబద్ధత కల్పించుట మరియు నిధులు, విధివిధానాలతో పాటు రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ మరియు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయుట గురించి.
ఆర్యా!
అనేక సంవత్సరాల నిరుపేద రెడ్ల పోరాటాలను, నిరుపేద రెడ్డి విద్యార్థులకు అగ్రకులం పేరుతో ఉపాధి అవకాశాలలో ఎలాంటి ప్రభుత్వం సహాయం లేకపోవడం వలన, వాటి ఫలాలు పొందలేక పోతున్నారన్న విషయం మీకు విదితమే, గత పది సంవత్సరాలలో నిరుపేద రెడ్ల కోసం జరిపిన సభలు సమావేశాలు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు- ధర్నాలు- రాస్తారోకలు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 🌼అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసినప్పటికీ, వెర్వకుండా నిరుపేద రెడ్ల కోసం ఉద్యమాలతో పాటు అనేక పట్టణాలలో, గ్రామాలలో రెడ్డి పరపతి సంఘాలు- రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు కొంత మేరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది🌼.
💐కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం వంద రోజులలో “రెడ్డి కార్పొరేషన్” ఏర్పాటు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. కానీ నేటి వరకు విధివిధానాలు ప్రకటించలేదు, పాలకవర్గాన్ని ప్రకటించలేదు, దీనివల్ల నిరుపేద రెడ్లు ఆశించిన ఫలితం రాలేదని తీవ్ర ఆవేదనకు, మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు.
కావున దయచేసి వెంటనే రెడ్డి కార్పొరేషన్ చట్టబద్ధతతో పాటు నిధులు కేటాయించాలని, విధివిధానాలు ప్రకటించాలని, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గాన్ని కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం💐. అంతే కాకుండా నిరుపేద రెడ్డి యువతీ – యువకులకు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగకరమైన ఈడబ్ల్యూఎస్ (EWS) ను విద్యా – ఉద్యోగ అవకాశాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని మరియు “EWS ఈడబ్ల్యూఎస్ కమిషన్” ను జాతీయ, రాష్ట్రంలో ఏర్పాటుకు కృషి చేయాలని “రెడ్డి సంఘం తెలంగాణ” తరుపున తమరికి విజ్ఞప్తి చేయుచున్నాము.
రాష్ట్ర అధ్యక్షులు –
గోపు జైపాల్ రెడ్డి
రాష్ట్ర కన్వీనర్
బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి –
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నల్ల సంజీవ రెడ్డి
Mr. To Hon’ble Chief Minister of Telangana State
Request letter submitted by “Telangana Reddy Sangam” to Mr. Enumula Revanth Reddy
Subject:- Regarding giving legitimacy to Reddy Corporation and constitution of Reddy Corporation chairman and governing body along with funding and procedures.
Arya!
You know that many years of poor Reddy’s struggles, poor Reddy students are unable to get their fruits due to the lack of any government help in employment opportunities in the name of upper caste, meetings held for the poor Reddy in the last ten years, appeals to government officials, public representatives – dharnas – rastarokas, assembly siege etc. Programs have been undertaken. 🌼Despite the arrests and house arrests, Reddy Parapathy Sanghas- Reddy Welfare Sanghas have been established in many towns and villages along with the movements for the poor Reds and some extent of assistance has been provided to the poor students🌼.
💐The state cabinet approved the formation of “Reddy Corporation” within 100 days as per the promise after the Congress government came to power. But until today, the procedures have not been announced and the ruling class has not been announced, due to which the poor Reds are suffering from deep anguish and mental anxiety that the expected result has not been achieved.
Therefore, we request you to immediately allocate the funds along with the legality of the Reddy Corporation, announce the procedures, announce the chairmanship of the Reddy Corporation as well as the governing body. Apart from that, we on behalf of “Reddy Sangam Telangana” are appealing to you to implement EWS (EWS) in education and job opportunities to the full extent for the economic survival of the poor Reddy young women and men and to work for the establishment of “EWS EWS Commission” in the national and state.
State President–
Gopu Jaipal Reddy
State Convener
Badduri Venkateshwar Reddy –
Chief Secretary of the State
Nalla Sanjeeva Reddy..