హర్యానాలో స్వీపర్ పోస్టులకు 46 వేల మంది గ్రాడ్యుయేట్ల ధరఖాస్తు
హర్యానాలో రూ.15 వేల జీతంతో స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్
6 వేల మంది పీజీ, 40 వేల మంది డిగ్రీ ఉత్తీర్ణులు, మొత్తం 1.2 లక్షల మంది అభ్యర్థుల ధరఖాస్తు
సెప్టెంబర్ 04, నల్లా సమాచార్ న్యూస్ :
దేశంలో నిరుద్యోగ సమస్యను తెలిపే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలో స్వీపర్ పోస్టులకు 46 వేల మంది గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుంది. హర్యానాలో 15000 జీవితంతో సూపర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, అందులో 6000 మంది పేజీ 40000 మంది డిగ్రీ ఉత్తీర్ణులు మొత్తం 1.2 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న గ్రాడ్యుయేట్లు ప్రైవేటులో ఉద్యోగ భద్రత లేకపోవడం, రూ.10 వేల జీతం ఇస్తున్నారని, ఇక్కడ రూ.15 వేల జీతంతో పాటు భవిష్యత్తులో పర్మినెంట్ అవుతుందని ఆశిస్తున్నట్లు అభ్యర్థులు తెలుపుతున్నారు.