మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావుల ఒత్తిడి వల్లే కాలేశ్వరం ఫైల్స్ పై సంతకాలు: నరేందర్
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ఒత్తిడి వల్లే కాలేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ల ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు సిడిఓ మాజీ ఈ.ఎన్.సి నరేందర్ రెడ్డి తెలిపారు .కాలేశ్వరం కమిషన్ ఎదుట ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే తప్పులు జరిగాయని, పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ సరిగా చెక్ చేయలేదని ఆయన తెలిపారు. మేడిగడ్డ ప్రతి డిజైన్లో సీటీవీతో పాటు ఎల్ అండ్ టీ సంస్థ పాల్గొన్నదని ఆయన కమిషన్ ఎదుట చెప్పారు.
మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ఒత్తిడి వల్లే కాళేశ్వరం ఫైల్స్ పై సంతకాలు: నరేందర్ రెడ్డి
