రాత్రివేళ మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ తప్పుడు ప్రచారం:స్పందించిన పోలీసులు
నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్:
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఇంటివద్ద ఉచితంగా దించుతారనే ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు “మహిళలు 1091, 7837018555 నెంబర్ కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుంది’ అని కొందరు వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ మెసేజ్ తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు